Welcome to Pustakanidhi

అందరికీ నమస్కారం,

“శ్రీ రాఘవేంద్ర బుక్ సెంటర్” అను ఈ సంస్థ మా తండ్రి గారైన భూమ శ్రీనివాసరావు గారిచే 1982 లో స్థాపించబడినది. కాలానుగుణంగా అందరి అభిరుచుల మేరకు మా సంస్థ ద్వారా పుస్తక విక్రయాలు జరుగుతున్నవి. అరండల్ పేటలో ఒక చిన్న షాపుగా ప్రారంభమైన మా ప్రస్థానం ప్రజలందరి ఆదరణతో అంచెలంచెలుగా ఎదిగి నేడు బ్రాడీపేటలో ఎనిమిది గదుల పూర్తి ప్రదర్శనానుగుణమై ఉన్న పుస్తక భాండాగారంగా మలచబడినది. నేడు గుంటూరులో ఆధ్యాత్మిక పుస్తకం అనగానే మొట్ట మొదటిగా అందరికీ గుర్తుకు వచ్చేది మా సంస్థే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒక్క మా ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రతీ ఒక్కరికి పుస్తకాలు చేరువయ్యేలా భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు దేశ విదేశాలకు సైతం నేడు కొరియర్ సౌకర్యంతో పుస్తకాలను పంపుతున్నాము. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మన సంస్కృతీ సాంప్రదాయాలు, వాస్తు, జ్యోతిష, తాంత్రిక, పూజా పుస్తకాలు, ఆయుర్వేద గ్రంథాలు ఇలా ఎన్నో రకాల పుస్తకాలు భావితరాల వారి అందరికీ అందుబాటులోకి రావాలని, ప్రజలు అత్యంత దగ్గరయ్యేందుకు చేసే మా ఈ నూతన ప్రయత్నమే “pustakanidhi.com”.

దీనిని మీరందరు ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ ఇప్పటివరకు మా సంస్థ ఉన్నతికి తోడ్పడిన అందరికీ ధన్యవాదాలు తెలుపుచున్నాము.

– మీ B. V. N. R. Pavan Kumar

Proprietor
Sri Raghavendra Book Centre
GUNTUR